Rajnath Singh: ఆందోళనకరంగానే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం... ఆసుపత్రికి వెళ్లిన రాజ్ నాథ్ సింగ్!

Rajnath Singh Visited Hospital Where Pranab Treated

  • ఆర్మీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స
  • పరిస్థితి అడిగి తెలుసుకున్న రాజ్ నాథ్ సింగ్
  • త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్న మంత్రి

బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉండటంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆసుపత్రిని సందర్శించి, ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను సమాచారం అడిగి తెలుసుకున్నారు. ప్రణబ్ కు కరోనా కూడా సోకడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండటంతో, ప్రస్తుతం ఆయన్ను వెంటిలేటర్ పై ఉంచి, చికిత్స అందిస్తున్నారు. తాను ఆర్మీ ఆసుపత్రిని సందర్శించానని, ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని రాజ్ నాథ్ సింగ్, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News