Akhil Akkineni: 'సైరా' దర్శకుడితో అఖిల్ తదుపరి సినిమా?

Akhil next film with Surendar Reddy

  • ఇంతవరకు విజయాన్ని అందుకోని అఖిల్
  • బొమ్మరిల్లు భాస్కర్ తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్'
  • సురేందర్ రెడ్డి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్

చిరంజీవితో 'సైరా' వంటి భారీ చిత్రాన్ని చేసిన తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి తన తదుపరి చిత్రాన్ని ఇంతవరకు ప్రారంభించలేదు. ఫలానా వాళ్లతో ఆయన చేస్తున్నాడంటూ రకరకాల వార్తలు వచ్చినప్పటికీ, ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించే చిత్రం తాజాగా ఖరారైందని తెలుస్తోంది. అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా ఆయన తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడని అంటున్నారు.

ఇంతవరకు అఖిల్ హీరోగా నాలుగు సినిమాలు చేసినా ఒక్కటీ విజయాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం తన ఐదవ చిత్రాన్ని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' పేరిట బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. దీనిపై అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో సురేందర్ రెడ్డి చెప్పిన కథ బాగుండడంతో ఈ ప్రాజక్టు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడికావచ్చు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News