Bonthu Rammohan: నాకు కరోనా నెగెటివ్ వచ్చింది: సంతోషంగా వెల్లడించిన బొంతు రామ్మోహన్

Hyderabad mayor Bonthu Rammohan tells he was tested corona negative

  • ఇటీవల రామ్మోహన్ కు కరోనా
  • పూర్తిగా కోలుకున్న వైనం
  • శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపిన మేయర్

కొన్ని రోజుల కిందట కరోనా బారిన పడిన హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. తనకు నిర్వహించిన వైద్య పరీక్షలో కరోనా నెగెటివ్ వచ్చిందని స్వయంగా రామ్మోహన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన ఆరోగ్య పరిస్థితి పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. "కరోనా నుంచి కోలుకున్నానని చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉంది. నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు" అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, తనకు చివరి కరోనా టెస్టులో నెగెటివ్ రాగా, ఆ టెస్టు రిపోర్టును కూడా తన ట్వీట్ కు జోడించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News