Bangladesh: భారత్ తో మా సంబంధాలు 'రాక్ సాలిడ్'... బంగ్లాదేశ్ ఉద్ఘాటన

Bangladesh says ties with India is in rock solid state

  • తమది చారిత్రాత్మక అనుబంధం అని పేర్కొన్న బంగ్లాదేశ్
  • తమ విజయం భారత్ విజయమేనన్న బంగ్లా విదేశాంగ మంత్రి
  • దీన్ని ఎవరూ ఆటంకపర్చలేరని వెల్లడి

కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణమాలు చూస్తే భారత్ కు పొరుగున ఉన్న దేశాలు వ్యతిరేకంగా మారుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఎప్పటినుంచో చైనా, పాకిస్థాన్ అక్కసు వెళ్లగక్కుతుండగా... ఈ మధ్య చైనా అండ చూసుకుని నేపాల్ కూడా రెచ్చిపోతోంది. కానీ బంగ్లాదేశ్ మాత్రం అన్నివేళలా భారత్ కు నమ్మదగిన మిత్రదేశంగా ఉంది. ఇప్పుడు కూడా ఆ మాటే చెబుతోంది.

"భారత్ తో మా సంబంధాలు చారిత్రాత్మకమైనవి... రాక్ సాలిడ్!" అంటూ బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ ఉద్ఘాటించారు. "అనేక వాణిజ్యపరమైన అంశాలు చైనాతో ముడిపడి ఉన్నా, మనది రక్త సంబంధం" అని వ్యాఖ్యానించారు.

"మేం విజయం సాధిస్తే భారత్ విజయం సాధించినట్టే. మా అభివృద్దే భారత్ అభివృద్ధి. మా సంబంధాలను మరేదీ ఆటంకపర్చలేదు" అని అన్నారు. కేరళలో జరిగిన విమానప్రమాదంపై సంతాపం వ్యక్తం చేసేందుకు అబ్దుల్ మోమెన్ భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్ తో తమ అనుబంధంపై భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News