Raviteja: రవితేజ సినిమాకి మాస్ టైటిల్ ఎంపిక!

Mass title considered for Ravitejas new flick

  • నాలుగైదు కొత్త ప్రాజక్టులకు రవితేజ ఓకే 
  • రమేశ్ వర్మ సినిమాలో ద్విపాత్రాభినయం
  • హీరోయిన్లుగా రాశిఖన్నా, నిధి అగర్వాల్
  • 'కిలాడి' అనే టైటిల్ పట్ల రవితేజ మోజు  

రవితేజ ఇప్పుడు యమా జోరుమీదున్నాడు. లాక్ డౌన్ కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని కొత్త కథలు వినడానికి వినియోగించుకుంటున్నాడు. పలువురు పాత, కొత్త దర్శకులు కలిసి ఆయనకు కథలు వినిపిస్తున్నారు. వీటిలో తనకు బాగా నచ్చడంతో.. నాలుగైదు కొత్త ప్రాజక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. అవన్నీ కూడా వన్ బై వన్ మొదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో రమేశ్ వర్మ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి రవితేజ ఓకే చెప్పాడు. ఇందులో ఆయన రెండు వెరైటీ పాత్రలు పోషిస్తూ ద్విపాత్రాభినయం చేస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా ఇప్పటికే రాశిఖన్నా, నిధి అగర్వాల్ లను ఎంపిక చేశారు. ఇక ఈ చిత్రానికి 'కిలాడి' అనే మాస్ టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తాజా సమాచారం. ఈ టైటిల్ రవితేజకు కూడా బాగా నచ్చడంతో దీనినే ఫైనల్ చేసే అవకాశం వుంది. ప్రస్తుతం రవితేజ 'క్రాక్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Raviteja
Rashikhanna
Nidhi Agarwal
Ramesh Vaema
  • Loading...

More Telugu News