Kajal Agarwal: తమిళ స్టార్ హీరో సినిమాలో కాజల్

Kajal opposite Vijay again

  • విజయ్ తో మరోసారి నటించే ఛాన్స్ 
  • విజయ్, మురుగదాస్ కాంబోలో సినిమా
  • ఆచార్య, ఇండియన్ 2, ముంబై సాగా చిత్రాలలో కాజల్  

కొత్త హీరోయిన్ల తాకిడి ముమ్మరంగా వున్నప్పటికీ, అందాలతార కాజల్ అగర్వాల్ కు ఇంకా ఆఫర్లు వస్తూనే వున్నాయి. ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో విజయ్ తో మరోసారి జతకట్టే చాన్స్ ఆమెకు దక్కింది. గతంలో విజయ్ హీరోగా రూపొందిన 'మెర్సల్', 'తుపాకి', 'జిల్లా' చిత్రాలలో కాజల్ కథానాయికగా నటించింది.

'తుపాకి' తర్వాత ఇప్పుడు మురుగదాస్-విజయ్ కలయికలో మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. వారిలో ఒకరిగా తాజాగా కాజల్ ను తీసుకున్నట్టు కోలీవుడ్ సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ కరోనా కుదుట పడ్డాక మొదలవుతుంది. ఇందులో నటించే మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది.

ఇదిలావుంచితే, కాజల్ ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన 'ఆచార్య', తమిళంలో కమలహాసన్ పక్కన 'ఇండియన్ 2' చిత్రాలలో కథానాయికగా నటిస్తోంది. మరోపక్క హిందీలో రూపొందుతున్న మల్టీ స్టారర్ 'ముంబై సాగా'లో కూడా ఆమె నటిస్తోంది.

Kajal Agarwal
Vijay
Chiranjeevi
Kamalahassan
  • Loading...

More Telugu News