Mahesh Babu: పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి ముగ్గురిని నామినేట్ చేసిన మహేశ్ బాబు

Mahesh Babu participates in Green India Challenge
  • గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించిన మహేశ్ బాబు
  • తన నివాసంలో మొక్కలు నాటిన వైనం
  • ఈ కార్యక్రమానికి అందరూ మద్దతివ్వాలని విజ్ఞప్తి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన పుట్టినరోజు (ఆగస్టు 9) సందర్భంగా మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించిన మహేశ్ బాబు తన నివాసంలో కొన్ని మొక్కలు నాటడమే కాకుండా, ఈ చాలెంజ్ లో భాగంగా మరో ముగ్గురిని నామినేట్ చేశారు.

ఈ విషయాన్ని మహేశ్ బాబు ట్విట్టర్ లో వెల్లడించారు. "నా పుట్టినరోజును ఇంతకంటే మంచిగా సెలబ్రేట్ చేసుకోలేనేమో! అందుకే గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించాను. ఇప్పుడీ చాలెంజ్ ను స్వీకరించాల్సిందిగా జూనియర్ ఎన్టీఆర్, తమిళ హీరో విజయ్, శృతి హాసన్ లను నామినేట్ చేస్తున్నాను. ఈ చాలెంజ్ ను ఎల్లలు దాటించే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని మిమ్మల్నిందరినీ కోరుతున్నాను. పచ్చని ప్రపంచం కోసం ఒక్క అడుగు ముందుకు వేద్దాం" అంటూ మహేశ్ బాబు పేర్కొన్నారు.

Mahesh Babu
Green India Challenge
Sapplings
Jr NTR
Tarak
Actor Vijay
Shruti Haasan
HBD
Tollywood

More Telugu News