Mahesh Babu: 'ఎడ్జ్'తో ఊపేస్తున్న శ్రుతిహాసన్... ముగ్ధుడైన మహేశ్ బాబు

Mahesh Babu loves Edge single by Shruti Haasan

  • సింగిల్ సాంగ్ తో ఆకట్టుకుంటున్న అందాల భామ
  • పాప్ సాంగ్ కంపోజ్ చేసిన శ్రుతి 
  • కంగ్రాచ్యులేషన్స్ అంటూ అభినందించిన మహేశ్ బాబు

అందాల భామ శ్రుతిహాసన్ మంచి గాయని అన్న సంగతి తెలిసిందే. నటన కంటే ముందు ఆమె పాప్ సంగీత రంగంలో ప్రవేశించి తన మ్యూజిక్ బ్యాండ్ తో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. తాజాగా శ్రుతిహాసన్ 'ఎడ్జ్' అనే సింగిల్ సాంగ్ రూపొందించారు. శ్రుతి గళం నుంచి జాలువారిన ఈ గీతం ఆన్ లైన్ లో ఊపేస్తోంది.

పాశ్చాత్య బాణీల్లో స్వరపరిచిన ఈ పాట టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును కూడా ఆకట్టుకుంది. ఈ పాటను ఎంతో ఇష్టపడుతున్నాను అంటూ మహేశ్ ట్వీట్ చేశారు. కంగ్రాచ్యులేషన్స్ శ్రుతిహాసన్... నువ్వు ఆలపించిన 'ఎడ్జ్' పాటను విన్నాను.. ఊపేసేయ్! అంటూ ప్రోత్సహించారు. 'ఎడ్జ్' పాట పూర్తిగా ఆంగ్లంలో సాగుతుంది. ఈ గేయానికి సాహిత్యం కూడా శ్రుతిహాసనే సమకూర్చింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News