Abhishek Bachchan: మాటంటే మాటే!... చెప్పినట్టుగానే కరోనాపై గెలిచాను: అభిషేక్ బచ్చన్

Abhishek Bachchan tested corona negetive

  • అభిషేక్ కు కరోనా నెగెటివ్
  • అందరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్
  • వైద్యసిబ్బందికి ఎప్పటికీ రుణపడి ఉంటానని వ్యాఖ్యలు

ఇటీవలే కరోనా బారిన పడిన బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. తనకు కరోనా నెగెటివ్ వచ్చిందని అభిషేక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "మాటంటే మాటే! ఈ మధ్యాహ్నం నాకు కరోనా టెస్టు చేయగా నెగెటివ్ అని వచ్చింది. ఈ వైరస్ ను జయిస్తానని మీకు ముందే చెప్పాను. నాకోసం, నా కుటుంబం క్షేమం కోసం ప్రార్థనలు చేసినవారందరికీ కృతజ్ఞతలు. నానావతి ఆసుపత్రిలో చికిత్స అందించిన డాక్టర్లకు, నర్సులకు, వైద్య సిబ్బంది అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. థాంక్యూ!" అంటూ అభిషేక్ తన స్పందన వెలిబుచ్చారు.

Abhishek Bachchan
Corona Virus
Negative
Cure
Recovery
Bollywood
  • Loading...

More Telugu News