jharkhand: బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్‌పై ఝార్ఖండ్ సీఎం రూ. 100 కోట్ల పరువు నష్టం దావా!

Jharkhand CM Hemant Soren sent notices to BJP MP Nishikanth

  • ముంబైలో ఓ మహిళపై హేమంత్ సోరెన్ అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణ
  • పోస్టులు తొలగించని ట్విట్టర్, ఫేస్‌బుక్‌లకూ నోటీసులు
  • ఈ నెల 22కి కేసు విచారణ వాయిదా

బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దూబేపై ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను ఆయనీ నోటీసులు పంపారు. రాంచీ సివిల్ కోర్టులో దావా దాఖలు చేసిన సీఎం.. నిషికాంత్‌తోపాటు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లను కూడా పార్టీలుగా చేర్చారు.

హేమంత్ సోరెన్ 2013లో ముంబైలో ఓ మహిళపై అత్యాచారం చేశారంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ ట్విట్టర్ ద్వారా తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన సోరెన్.. పరువు నష్టం దావా వేశారు. అంతేకాదు, తనపై చేసిన ఆరోపణల పోస్టింగులను ఫేస్‌బుక్, ట్విట్టర్ తొలగించకపోవడంతో వాటిని కూడా ప్రతివాదులుగా చేర్చారు. కాగా, ఈ కేసు విచారణను ఈ నెల 22వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News