Committee: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అధ్యయన కమిటీ

Special committee appointed for study on new districts in AP

  • సీఎస్ చైర్మన్ గా ఆరుగురు సభ్యులతో కమిటీ
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
  • మూడు నెలల్లో నివేదిక ఇవ్వనున్న కమిటీ

ఏపీలో లోక్ సభ నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని వైసీపీ సర్కారు ఇంతకుముందే పేర్కొంది. ఈ క్రమంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అధ్యయన కమిటీ ప్రకటించారు. అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎస్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. మంత్రిమండలి నిర్ణయం మేరకు జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కోసం ఏర్పాటైన ఈ అధ్యయన కమిటీకి సీఎస్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో ఆరుగురు ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. లోక్ సభ నియోజకవర్గాల సంఖ్య ఆధారంగా ఏపీలో 25 జిల్లాలు ఏర్పడనున్నాయి. కాగా, 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు నిర్దేశించారు.

  • Loading...

More Telugu News