Ketika Sharma: తొలిచిత్రం విడుదల కాకుండానే ముంబై భామకు మరో ఛాన్స్

Ketika Sharma gets one more offer from Tollywood
  • పూరి 'రొమాంటిక్'తో కేతిక పరిచయం 
  • సంతోష్ జాగర్లపూడితో నాగశౌర్య సినిమా 
  • హీరోయిన్ గా ఎంపికైన కేతిక 
ముంబై భామలంటే టాలీవుడ్ లో వుండే క్రేజే వేరు. ఎలాంటి సీన్లో నటించమన్నా అభ్యంతరం చెప్పరు. కాసింత ఎక్కువ గ్లామర్ కురిపించమన్నా 'నో' చెప్పరు. అందుకే, కాస్త పారితోషికం ఎక్కువైనా ముంబై ముద్దుగుమ్మల్ని మన దర్శక నిర్మాతలు తమ సినిమాలలో హీరోయిన్లుగా తీసుకుంటూ వుంటారు.

అదే విధంగా, ప్రస్తుతం పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటిస్తున్న 'రొమాంటిక్' చిత్రంలో నటిస్తున్న ముంబై భామ కేతిక శర్మ ఆ సినిమాలో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. దీంతో తొలిసినిమా ఇంకా విడుదల కాకుండానే ఈమెకు టాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా యంగ్ హీరో నాగశౌర్య సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య తాజాగా ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో కథానాయికగా కేతికను బుక్ చేసినట్టు సమాచారం. విలువిద్య నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టినీ ఆకర్షించింది.    
Ketika Sharma
Naga shourya
Puri Jagannadh
Aakash

More Telugu News