Anupama Pathak: ఎవరినీ నమ్మవద్దని వాపోతూ... భోజ్ పురి నటి అనుపమ ఆత్మహత్య!

Bhojpuri Actress Anupama Sucide

  • కుదిపేస్తున్న వరుస ఆత్మహత్యలు
  • మరణానికి ముందు ఫేస్ బుక్ లో వీడియో
  • ప్రజలు స్వార్థపరులని వ్యాఖ్యానించిన అనుపమ

చిత్ర పరిశ్రమను వరుస ఆత్మహత్యలు కుదిపేస్తున్నాయి. మొన్న సుశాంత్ సింగ్ ఆత్మహత్య రేపిన కలకలం చల్లారకముందే, హిందీ టీవీ నటుడు సమీర్ శర్మ సూసైడ్ చేసుకున్నారు. తాజాగా, తన నివాసంలో భోజ్ పురి నటి అనుపమా పాథక్ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరణానికి ఒకరోజు ముందు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ వేదికగా, తన ఆవేదనను పంచుకోగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.

ఈ లోకంలో ఎవరినీ నమ్మ వద్దంటూ అనుపమ వాపోయింది. నమ్మితే మోసపోక తప్పదని హెచ్చరించింది. తన జీవితంలో ఈ పాఠాన్ని నేర్చుకున్నానని, ప్రజలు ఎంతో స్వార్ధపరులని, ఇతరులు ఏమైనా పట్టించుకోబోరని తన వీడియోలో పేర్కొంది. తాను పెట్టుబడిగా పెట్టిన డబ్బును మెచ్యూరిటీ తరువాత కూడా మలాడ్ లోని విజ్ డమ్ ప్రొడ్యూసర్ సంస్థ ఇవ్వలేదని, దాంతో పాటు మనీష్ ఝా అనే అతను, తన వాహనాన్ని తీసుకుని ఇవ్వలేదని ఆమె తన సూసైడ్ నోట్ లో ఆరోపించినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసును విచారిస్తున్నారు.

Anupama Pathak
Bhojpuri
Sucide
Artist
  • Loading...

More Telugu News