Alia Bhat: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం   

Alia Bhat joins RRR shoot next year

  • 'ఆర్ఆర్ఆర్'కి అలియా డేట్స్ ఎప్పుడు? 
  • నాగార్జున సినిమా నుంచి టీజర్ 
  • కన్నడ నాట మహేశ్ సినిమా రికార్డ్ 

*  రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం షూటింగులో కథానాయిక అలియా భట్ వచ్చే ఏడాది జాయిన్ అవుతుందని తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోగా, ఇటీవల రాజమౌళి కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ఈ చిత్రం షూటింగ్ వాయిదాపడుతూ వస్తోంది. మరోపక్క, అలియా 'బ్రహ్మాస్త్ర' చిత్రం షూటింగును పూర్తి చేయాల్సి ఉండడంతో, ముందుగా ఆ చిత్రానికే ఆమె డేట్స్ ఇస్తోందట.  
*  నాగార్జున హీరోగా రూపొందుతున్న 'వైల్డ్ డాగ్' చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ను ఈ నెల 29న ఆయన బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. నూతన దర్శకుడు సోల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగుకి సంబంధించి మరో షెడ్యూలు షూటింగ్ మిగిలివుంది.
*  మహేశ్ బాబు హీరోగా సంక్రాంతికి వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం మంచి హిట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రాన్ని కన్నడలో డబ్ చేసి తాజాగా అక్కడి పాప్యులర్ టీవీ ఛానెల్ ప్రసారం చేసింది. దీనికి విశేష ప్రేక్షకాదరణ లభించింది. ఏకంగా 6.5 టీఆర్పీ రేటింగ్ వచ్చినట్టు సమాచారం. చిరంజీవి నటించిన 'సైరా' కన్నడ వెర్షన్ కి 6.3 రేటింగ్ మాత్రమే రాగా, దీనిని మహేశ్ సినిమా అధిగమించింది.

Alia Bhat
Rajamouli
Nagarjuna
Mahesh Babu
  • Loading...

More Telugu News