Prabhas: ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో ప్రభాస్ సందడి

Hero Prabhas spotted at Khairatabad RTA Office

  • మాస్కుతో ఆర్టీఏ ఆఫీసుకు విచ్చేసిన అగ్రహీరో ప్రభాస్
  • కొత్త కారుకు రిజిస్ట్రేషన్
  • ఫొటోలకు ఎగబడిన అభిమానులు, సిబ్బంది!

కరోనా నేపథ్యంలో షూటింగుల్లేక ఇంటివద్దే విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్న టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ చాలా రోజుల తర్వాత ఓ పబ్లిక్ ప్లేసులో కనిపించారు. ఆయన ఖైరతాబాదు ఆర్టీఏ ఆఫీసులో దర్శనమిచ్చారు. కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ప్రభాస్ ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లగా, అభిమానులు, అక్కడి సిబ్బంది ఫొటోల కోసం ఎగబడ్డారు. అయితే ప్రభాస్ అందరితో ఓపిగ్గా ఫొటోలు దిగి వారిలో ఆనందం నింపాడు. మాస్కుతో ఉన్న ప్రభాస్ ను చూడగానే కొందరు సెల్ఫీలకు రిక్వెస్ట్ చేసి తమ ముచ్చట తీర్చుకున్నారు. సాహో తర్వాత ప్రభాస్ నుంచి మరే చిత్రం రాలేదు, రాధేశ్యామ్ అనే చిత్రం నుంచి ఇటీవలే ఫస్ట్ లుక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ కనిపిస్తే అదే చాలన్నట్టుగా అభిమానులు ఆర్టీఏ ఆఫీసులో సందడి చేశారు.

Prabhas
RTA Office
Car
Registration
Khairatabad
Tollywood
  • Loading...

More Telugu News