JC Prabhakar Reddy: కాసేపట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల విడుదల.. కడప జైలు వద్ద కోలాహలం!

JC Prabhakar Reddy to be released from jail shortly
  • కడప సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న జేసీ ప్రభాకర్ రెడ్డి
  • నిన్న బెయిల్ మంజూరు చేసిన అనంతపురం కోర్టు
  •  జేసీని తాడిపత్రికి తీసుకెళ్లేందుకు భారీ ఏర్పాట్లు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలు కాసేపట్లో కడప సెంట్రల్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. కాసేపటి క్రితం బెయిల్ పేపర్లతో జైల్లోకి జేసీ లాయర్ వెళ్లారు. మరోవైపు జైలు పరిసర ప్రాంతాలు తాడిపత్రి నుంచి వచ్చిన జేసీ అభిమానులతో కోలాహలంగా మారాయి. దాదాపు 150 వాహనాలతో జేసీని తాడిపత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అనంతపురం కోర్టు అన్ని కేసుల్లో వీరికి నిన్న బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాడిపత్రిని విడిచి వెళ్లకూడదనే షరతును విధించింది. జేసీ ప్రభాకర్ రెడ్డికి స్వాగతం పలికేందుకు తాడిపత్రిలో సైతం కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
JC Prabhakar Reddy
JC Asmith Reddy
KADAPA Jail
Telugudesam

More Telugu News