Mumbai: ముంచెత్తిన వర్షాలు.. మునిగిన ముంబయి!

Mumbai batters with heavy rains and gusting winds

  • ముంబయిలో కుండపోత
  • జలదిగ్బంధనంలో పలు ప్రాంతాలు
  • రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

ముంబయి మహానగరం కుండపోత వర్షాలతో తల్లడిల్లుతోంది. గత మూడ్రోజులుగా ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ ఉదయం వరుణుడు శాంతించినా అప్పటికే నగరం నీట మునిగింది! లోతట్టు ప్రాంతాలే కాదు రహదారులు సైతం చెరువులను తలపిస్తున్నాయి. వర్షాలకు తోడు 70 కిమీ వేగంతో గాలులు కూడా వీయడంతో చెట్లు కూలిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. షేక్ మిస్త్రీ దర్గా రోడ్, బీపీటీ కాలనీ, ఖేత్వాడి, నాయర్ హాస్పిటల్, సీపీ ట్యాంక్ ప్రాంతాలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి.

ఇక దక్షిణ ముంబయి ప్రాంతంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 12 గంటల వ్యవధిలో 294 మిమీ వర్షపాతం నమోదైంది. ఆగస్టులో ఈ మేర వర్షపాతం నమోదవడం 1974 తర్వాత ఇదే ప్రథమం. అటు, తీవ్ర వర్షాలతో బాంబే హైకోర్టు తన కార్యకలాపాలన్నీ రద్దు చేసింది. ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 5 బృందాలు ముంబయిలో సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి.

Mumbai
Heavy Rains
Winds
City
  • Loading...

More Telugu News