amazon: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్లు

offers in amazon flipkart

  • ప్రైమ్‌ డే-2020 సేల్ పేరిట అమెజాన్ ఆఫర్లు
  • బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ పేరిట ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్లు
  • మొబైల్‌ ఫోన్లు, టీవీలతో పాటు అనేక వస్తువులపై ఆఫర్లు

ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేకంగా భారీ ఆఫర్లను ప్రకటించాయి.  ప్రైమ్‌ డే-2020 సేల్ పేరిట అమెజాన్ తన వెబ్‌సైట్‌లో మొబైల్‌ ఫోన్లు, టీవీలతో పాటు అనేక ఎలక్ట్రానిక్‌ వస్తువులపై ఆఫర్లు ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్‌ సభ్యులకు అందుబాటులోకి వచ్చిన ఈ ప్రత్యేక రాయితీలు రేపు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి. కొన్ని రకాల స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం, హోమ్‌ అప్లయన్సెస్‌పై 60 శాతం వరకు తగ్గింపు ధరలను అమెజాన్‌ ప్రకటించింది.

బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ పేరిట ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైన ఆఫర్లు ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ సభ్యులు అనేక రకాల ఉత్పత్తులను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఫ్యాషన్‌ దుస్తులు, గృహోపకరణాలు వంటి వాటిపై డిస్కౌంట్లు కొనసాగుతున్నాయి. అంతేగాక, పలు బ్యాంకుల కస్టమర్లకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు కూడా ఉన్నాయి.

amazon
flipcart
India
  • Loading...

More Telugu News