Beiruit: శ్మశానాన్ని తలపిస్తున్న బీరుట్... నరమానవుడూ కనిపించని ఏరియల్ వ్యూ వీడియో!

Bieruit Ariel View Goes Viral

  • లెబనాన్ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు 
  • దాదాపుగా ఖాళీ అయిపోయిన బీరూట్
  • విషవాయువులు, దీర్ఘకాలిక వ్యాధుల భయం

లెబనాన్ రాజధాని బీరుట్ లో భారీ విస్ఫోటనాలు సంభవించిన తరువాత, దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొన్న వేళ, నగరం మొత్తం శ్మశాన వాతావరణాన్ని తలపిస్తోంది. వేలాది భవనాలు తీవ్రంగా దెబ్బతినగా, ప్రజలు మొత్తం నగరాన్ని వీడి వెళ్లిపోయారు. ముఖ్యంగా పోర్ట్ ప్రాంతంలో జనసంచారం కనిపించని పరిస్థితి నెలకొంది.

రోడ్లన్నీ గాజు పెంకులు, ఇనుప ఊచలు, భవన వ్యర్థాలతో నిండిపోయాయి. బహుళ అంతస్తుల భవంతులన్నీ నిర్మానుష్యమైపోయాయి. ఇందుకు సంబంధించిన ఏరియల్ వ్యూ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా, మొత్తం 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వ ఉంచిన ప్రాంతంలో పేలుడు జరుగగా, 100 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.

పేలుడు తరువాత గాల్లోకి విషవాయువులు వ్యాపించడంతో, దీర్ఘకాలిక వ్యాధులు సోకే ప్రమాదం ఉండటంతోనే ప్రజలంతా తమతమ నివాసాలను విడిచి వెళ్లిపోయారు. బీరుట్ పోర్ట్ ప్రాంతంలో గడచిన ఆరు సంవత్సరాలుగా అనుమతులు లేకుండా రసాయనాలను నిల్వ ఉంచారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇంతటి విపత్తుకు కారణమైన వారిని ఎవరినీ వదలబోమని ప్రధాని హసన్ హెచ్చరించారు. 

Beiruit
Blast
Ariel View
  • Error fetching data: Network response was not ok

More Telugu News