Brahmanandam: బ్రహ్మానందం గీసిన 'రామాంజనేయుల' చిత్రం... నెటిజన్ల ఫిదా!
![Brahmanandam New Drawing of Lord Rama and Hanuma](https://imgd.ap7am.com/thumbnail/cr-tn-6bd065367a13.jpg)
- ఇప్పటికే ఎన్నో చిత్రాలను గీసిన బ్రహ్మానందం
- రామాలయం శంకుస్థాపన సందర్భంగా కొత్త చిత్రం
- బ్రహ్మానందంపై పలువురి ప్రశంసలు
తన నటనతో దశాబ్దాలుగా నవ్వులను పంచుతున్న బ్రహ్మానందంలో ఓ మంచి చిత్ర కళాకారుడు కూడా ఉన్నాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన తన కుంచెతో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన చిత్రాలను గీశారు. తాజాగా, అయోధ్యలో రామాలయానికి శంకుస్థాపన జరిగిన సందర్భంగా బ్రహ్మానందం గీసిన రామాంజనేయుల చిత్రం వైరల్ అవుతుండగా, దీన్ని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. శ్రీరాముడు ఆప్యాయంగా హనుమంతుడిని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నట్టుగా ఉన్న చిత్రాన్ని బ్రహ్మానందం గీశారు. ఆయనలోని కళాకారుడిని పలువురు ప్రశంసిస్తున్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-086a06586e3837c468b02891ae619acaeb13e2c6.jpg)