Sushant Singh Rajput: సుశాంత్ మృతి కేసు.. సుప్రీంకోర్టులో రియాకు ఎదురుదెబ్బ

Supreme Court Refuses to Grant Protection to Rhea Chakraborty

  • రియా చక్రవర్తికి రక్షణ కల్పించేందుకు నిరాకరించిన కోర్టు
  • కేసును బీహార్ నుంచి ముంబైకి బదిలీ చేసేందుకూ నిరాకరణ
  • మూడు రోజుల్లో దర్యాప్తు వివరాలను సమర్పించాలని పోలీసులకు ఆదేశం

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో అతడి ప్రియురాలు రియా చక్రవర్తికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెకు రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. అలాగే, కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలన్న అభ్యర్థనను కూడా తిరస్కరించింది. అలాగే, ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి మూడు రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని ముంబై పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

అలాగే, మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని సంబంధిత పార్టీలను జస్టిస్ హృషికేశ్ రాయ్ సారథ్యంలోని ఏక సభ్య ధర్మాసనం ఆదేశించింది. రియాకు ప్రొటెక్షన్ కల్పించేందుకు కోర్టు నిరాకరించడంతో బీహార్ పోలీసులు ఏ సమయంలోనైనా రియాను ప్రశ్నించే అవకాశం ఉంది. సుశాంత్ మృతి కేసులో పాట్నాలో నమోదైన ఎఫ్ఐఆర్‌ను ముంబైకి బదిలీ చేయాలంటూ  రియాచక్రవర్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు పై ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News