Smitha: వర్కౌట్లు బాగా చేస్తే ఒళ్లు నొప్పులు వచ్చాయేమో అనుకున్నా, కానీ కరోనా పాజిటివ్ వచ్చింది: గాయని స్మిత

Tollywood singer Smitha and her husband tested corona positive

  • గాయని స్మితకు కరోనా
  • ఆమె భర్త శశాంక్ కు కూడా కరోనా పాజిటివ్
  • ఇంట్లోనే ఉన్నా కరోనా వచ్చిందని ట్వీట్

టాలీవుడ్ ప్రముఖుల్లోనూ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ప్రముఖ గాయని స్మిత కూడా కరోనా పాజిటివ్ వ్యక్తుల జాబితాలో చేరింది. బాగా వర్కౌట్లు చేస్తే ఒళ్లు నొప్పులు వచ్చాయేమో అనుకున్నానని, కానీ వైద్య పరీక్షలు చేస్తే కరోనా పాజిటివ్ వచ్చిందని వాపోయింది.

తన భర్త శశాంక్ కు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని స్మిత వెల్లడించింది. అయితే తమలో పెద్దగా లక్షణాలేవీ లేవని, ఈ మహమ్మారిని తమ శరీరాల్లోంచి తన్ని తరిమేందుకు వేచిచూస్తున్నామని, కరోనా తగ్గితే ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్మిత వివరించింది. తాము ఇంట్లోనే ఉన్నా కరోనా తమ ఇంటి వరకు వచ్చిందని ట్వీట్ చేసింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News