Vijayasai Reddy: సవాల్ సిల్లీగా ఉన్నా, ప్రజల భద్రతపై నారావారి నిబద్ధత ఏంటో అర్థమైపోయింది: విజయసాయి

Vijayasai Reddy responds to Chandrababu comments

  • వైసీపీ సర్కారుకు రాజధానిపై సవాల్ విసిరిన చంద్రబాబు
  • తన స్వార్థం కోసం దేనికైనా తెగిస్తాడంటూ విజయసాయి వ్యాఖ్యలు
  • ప్రాణాంతక రాజకీయ వైరస్ అంటూ విమర్శలు

ఇటీవల కరోనా మహమ్మారి నుంచి కోలుకుని వచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో మళ్లీ పుంజుకున్నారు. రాజధాని అంశంలో చంద్రబాబు విసిరిన చాలెంజ్ పై ఆయన తనదైన శైలిలో స్పందించారు. కరోనా వైరస్ వ్యాప్తి లేనప్పుడు స్థానిక ఎన్నికలకు భయపడిన బాబు, ఇప్పుడు వైరస్ వ్యాప్తి ఉన్న వేళ ఎన్నికలంటూ చాలెంజ్ విసురుతున్నాడని విమర్శించారు. సవాల్ సిల్లీగా ఉన్నా, ప్రజల భద్రతపై నారావారి నిబద్ధత ఏంటో అర్థమైపోయిందని వ్యాఖ్యానించారు. 'తన స్వార్థం కోసం ఎంతకైనా తెగించే ప్రాణాంతక రాజకీయ వైరస్ నారానిప్పు' అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

Vijayasai Reddy
Chandrababu
Challenge
AP Capital
Amaravati
Andhra Pradesh
  • Loading...

More Telugu News