Vizag: విశాఖలోని ఫార్మా కంపెనీలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

fire accident in vizag pharma company
  • అచ్యుతాపురం సెజ్‌లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు 
  • భయంతో బయటకు పరుగులు తీసిన కార్మికులు  
  • పలు వాహనాలు ధ్వంసం
  • మంటలను అదుపుచేసిన సిబ్బంది
విశాఖపట్నంలోని పరిశ్రమల్లో పదే పదే అగ్ని ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖలో ఈ రోజు ఉదయం మరో పరిశ్రమలో పేలుడు సంభవించి మంటలు ఎగిసిపడ్డాయి. అచ్యుతాపురం సెజ్‌లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. పరిశ్రమ నుంచి కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు.

ఫార్మా కంపెనీలో పేలుడు ధాటికి అక్కడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సమీపంలోనే అగ్నిమాపక యంత్రం ఉండడంతో దాని ద్వారా అక్కడి సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Vizag
Fire Accident

More Telugu News