Kul Bhushan Jadhav: కుల్ భూషణ్ జాదవ్ కు న్యాయవాదిని ఏర్పాటు చేసేందుకు భారత్ కు అనుమతివ్వండి: పాక్ హైకోర్టు
- ప్రభుత్వాన్ని ఆదేశించిన ఇస్లామాబాద్ హైకోర్టు
- తదుపరి విచారణ సెప్టెంబరు 3కి వాయిదా
- గతవారం ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఏర్పాటుచేసిన హైకోర్టు
గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ జైలులో మగ్గుతూ మరణశిక్ష ఎదుర్కొంటున్న కుల్ భూషణ్ జాదవ్ కు న్యాయవాదిని ఏర్పాటు చేయడంపై ఇస్లామాబాద్ హైకోర్టు సానుకూలంగా స్పందించింది. జాదవ్ కు న్యాయవాదిని ఏర్పాటు చేసేందుకు భారత్ కు అనుమతి ఇవ్వాలంటూ పాక్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. జాదవ్ కు న్యాయవాదిని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై ఇస్లామాబాద్ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. పాక్ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు విచారణను సెప్టెంబరు 3కి వాయిదా వేసింది. కాగా, జాదవ్ కేసులో పాకిస్థాన్ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు హైకోర్టు గతవారం ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఏర్పాటు చేసింది.