bihar: హీరో సుశాంత్‌ ప్రియురాలు రియా ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు: బీహార్ డీజీపీ

bihar police probe going on sushant case says dgp
  • పోలీసుల విచారణ కొనసాగుతోంది
  • నిన్న ప్రత్యేక పోలీసు బృందం ముంబైకి వెళ్లింది
  • సుశాంత్‌ బ్యాంక్‌ ఖాతాల వివరాలు సేకరించాం
ఇటీవల బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల విచారణ ప్రారంభమైనప్పటి నుంచి సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి కనపడకుండాపోయింది. ఈ కేసు గురించి బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే మీడియాతో మాట్లాడారు.  

రియా చక్రవర్తి  ఆచూకీ ఇప్పటి వరకు తెలియరాలేదని చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిన్న ప్రత్యేక పోలీసు బృందం ముంబైకి వెళ్లిందని తెలిపారు. సుశాంత్‌ మృతికి సంబంధించిన ఆధారాలను వారు సేకరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే తాము సుశాంత్‌ సోదరితో పాటు సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే, వంటమనిషి సహా పలువురిని ప్రశ్నించినట్లు చెప్పారు.

సుశాంత్‌ బ్యాంక్‌ ఖాతాల, లావాదేవీల వివరాలను బ్యాంకుల నుంచి తీసుకున్నామని వివరించారు. సుశాంత్‌ కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని చెప్పారు. కాగా, సుశాంత్‌ బ్యాంకు ఖాతా నుంచి రియా దాదాపు.15 కోట్లను కొట్టేసిందంటూ సుశాంత్‌ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
bihar
Police
Sushant Singh Rajput

More Telugu News