Andhra Pradesh: సీఆర్‌డీఏను రద్దుచేస్తూ నాలుగు రహస్య జీవోలను విడుదల చేసిన ఏపీ

AP Govt issues 4 confidential GOs on CMRDA

  • శుక్రవారం సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుకు గవర్నర్ ఆమోదం
  • కాన్ఫిడెన్షియల్ పేరుతో శనివారం నాలుగు జీవోల విడుదల
  • ఏఎంఆర్‌డీఏ ఏర్పాటు చేస్తున్నట్టుగా జీవోలు

ఏపీ సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోదం తెలిపిన కాసేపటికే ఆ విషయాన్ని గెజిట్‌లో నోటిఫై చేసిన ప్రభుత్వం.. దానికి బదులుగా అమరావతి మెట్రోపాలిటిన్ డెవలప్‌మెంట్ ఏరియా (ఏఎంఆర్‌డీఏ)ని ఏర్పాటు చేస్తూ శనివారం నాలుగు కాన్ఫిడెన్షియల్ (రహస్య) జీవోలు విడుదల చేసింది. పురపాలక శాఖ వీటిని విడుదల చేసింది. అయితే, వాటిలోని విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచుతూ వాటిని కాన్ఫిడెన్షియల్ జీవోలుగా పేర్కొంది. కొత్తగా ఏఎంఆర్‌డీఏని ఏర్పాటు చేస్తూ తీసుకొచ్చిన ఈ జీవోల్లో గతంలోని ఏపీసీఆర్‌డీఏ పరిధిలోని మొత్తం ప్రాంతాన్ని ఏఎంఆర్‌డీఏ పరిధిలోకి తీసుకొచ్చారా? లేకుంటే, ఏమైనా మార్పులు చేశారా? అన్న విషయం మాత్రం తెలియరాలేదు. 

  • Loading...

More Telugu News