Corona Virus: కరోనా అప్ డేట్స్: ఏపీలో ఒక్కరోజులో 12,750 మంది డిశ్చార్జి

Corona latest updates for AP

  • కొత్తగా 9,276 మందికి కరోనా
  • ఏపీలో ఒకటిన్నర లక్ష దాటిన పాజిటివ్ కేసులు
  • మరో 58 మంది మృత్యువాత

ఏపీలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య ఒకటిన్నర లక్ష దాటింది. అయితే ఊరట కలిగించేలా, ఒక్కరోజులోనే 12,750 మందిని డిశ్చార్జి చేశారు. గత 24 గంటల వ్యవధిలో 9,276 పాజిటివ్ కేసులు రాగా, మొత్తం కేసుల సంఖ్య 1,50,209కి పెరిగింది. ప్రస్తుతం 72,188 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా డిశ్చార్జి అయినవారితో కలుపుకుని కరోనా నుంచి కోలుకున్న మొత్తం వ్యక్తుల సంఖ్య 76,614 అని ప్రత్యేక బులెటిన్ లో పేర్కొన్నారు. ఇక, మరణాల విషయానికొస్తే, రాష్ట్రంలో మరో 58 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,407కి పెరిగింది.

Corona Virus
Andhra Pradesh
Recovery
Positive Cases
Deaths
COVID-19
  • Loading...

More Telugu News