Telangana: 5వ తేదీన టీఎస్ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

TS Cabinet to meet on Aug 5

  • 5వ తేదీ మధ్యాహ్నం ప్రగతి భవన్ లో కేబినెట్ భేటీ
  • కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
  • సెక్రటేరియట్ భవన నిర్మాణంపై చర్చించనున్న కేబినెట్

ఈ నెల 5వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీకి మంత్రులు, సీఎస్, డీజీపీ, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా కరోనా మహమ్మారి నియంత్రణపై ఎక్కువ దృష్టి సారించనున్నారు. కరోనా నేపథ్యంలో, విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలపై లోతుగా విశ్లేషించనున్నారు. సెక్రటేరియట్ నూతన భవన నిర్మాణంపై చర్చించనున్నారు. నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయంతో పాటు పలు అంశాలపై చర్చలు జరపనున్నారు.

Telangana
Cabinet Meeting
  • Error fetching data: Network response was not ok

More Telugu News