Devineni Uma: 'రాజధానిపై నాడు మీరు మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పండి జగన్ గారూ' అంటూ వీడియో పోస్ట్ చేసిన దేవినేని ఉమ

devineni fires on ycp

  • ఎన్నికల ముందు ప్రజారాజధానిగా అమరావతి ఉంటుందన్నారు
  • ప్రజలను నమ్మించి మోసం చేశారు
  • మాట తప్పారు.. మడమ తిప్పారు 

విజయవాడ సమీపంలో రాజధానిని నిర్మించడానికి తీసుకున్న నిర్ణయాన్ని తాము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామంటూ గత టీడీపీ హయాంలో వైఎస్ జగన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేస్తూ ఆయనపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో దేవినేని ట్విట్టర్ ద్వారా స్పందించారు.  

ఎన్నికల ముందు ప్రజారాజధానిగా అమరావతి ఉంటుందని ప్రజలను నమ్మించారని దేవినేని ఉమ చెప్పారు. ఇప్పుడు వైసీపీ నేతలు మోసం చేశారని, ఏరు దాటేవరకు ఏటిమల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అంటూ మాట తప్పారని, మడమ తిప్పారని ఆయన విమర్శించారు. నాడు వైసీపీ నేతలు మాట్లాడిన మాటలకు ప్రజలకు సమాధానం చెప్పాలని సీఎం జగన్‌ను దేవినేని నిలదీశారు.

Devineni Uma
Telangana
Jagan
Amaravati
  • Error fetching data: Network response was not ok

More Telugu News