BTech Ravi: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన బీటెక్ రవి.... బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంపై నిరసన

BTech Ravi resigns to MLC and send letter to Chairman

  • సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం
  • బీటెక్ రవి సంచలన నిర్ణయం
  • చైర్మన్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ పంపిన బీటెక్ రవి
  • చంద్రబాబుకు కూడా రాజీనామా లేఖ

టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి (మారెడ్డ రవీంద్రనాథ్ రెడ్డి) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వికేంద్రీకరణ బిల్లుకు, సీఆర్డీయే రద్దు బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీటెక్ రవి వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఈ బిల్లులను గవర్నర్ ఆమోదించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నానని వివరించారు. శాసనమండలి చైర్మన్ కు సంబంధిత ఫార్మాట్ లో రాజీనామా లేఖ పంపుతున్నానని తెలిపారు.

మండలి ఆమోదించని బిల్లులను గవర్నర్ ఆమోదించడం రాజ్యాంగ వ్యతిరేక చర్యగా భావించి తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్టు రవి వివరణ ఇచ్చారు. నాడు విభజన సందర్భంగా పార్లమెంటులో చేసిన చట్టాలకు సంబంధించి ఏ అంశమూ మన రాష్ట్రానికి దక్కలేదని, నేడు శాసనమండలికి దక్కిన ప్రాధాన్యం ఎంతో కలచివేసిందని, ఇలాంటి ప్రాధాన్యత లేని చట్టసభలో ఉండడం అనవసరమని భావించి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చానని ఆయన వివరించారు. ఎమ్మెల్సీ పదవి లేకపోయినా, పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. కాగా, తాను  రాజీనామా చేయబోయేముందు  చంద్రబాబు అనుమతి తీసుకోలేదని తెలిపారు.

  • Loading...

More Telugu News