Ashok Gehlot: నాడు తెలుగుదేశం ఎంపీలు రాత్రికి రాత్రే బీజేపీలో విలీనమవ్వలేదా?: రాజస్థాన్ సీఎం నోట సంచలన వ్యాఖ్యలు
- కాంగ్రెస్ లో విలీనమైన బీఎస్పీ ఎమ్మెల్యేలు
- తప్పుపడుతున్న బీజేపీ నేతలు
- టీడీపీ ఎంపీలు విలీనమైనప్పుడు ఈ వాదన ఏమైందన్న గెహ్లాట్
ఆగస్ట్ 14న రాజస్థాన్ అసెంబ్లీ సమావేశం జరగబోతోంది. ఆరోజున అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కానసాగుతుందా? లేక కూలిపోతుందా? అనే విషయం తేలనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జైపూర్ నుంచి జైసల్మేర్ కు తరలిస్తున్నారు.
ఈ సందర్భంగా గెహ్లాట్ మాట్లాడుతూ ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో విలీనం కావడాన్ని తప్పుపడుతున్నారని... తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు రాత్రికి రాత్రి బీజేపీలో విలీనమయ్యారని... ఈ విలీనాన్ని మాత్రం సరైందని బీజేపీ వాదిస్తుందని విమర్శించారు. మరి టీడీపీ ఎంపీలు విలీనమైనప్పుడు బీజేపీ వాదన ఏమైందని అసహనం వ్యక్తం చేశారు. రాజస్థాన్ లో విలీనాన్ని మాత్రం తప్పంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, బీఎస్పీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో విలీనమయ్యారు. వీరే లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి ఉండేది.