Saitej: మెగా హీరో సినిమాకి ఓటీటీ నుంచి భారీ ఆఫర్

Saitej movie gets crazy offer from OTT player

  • సినిమాల కోసం దూకుడు పెంచిన ఓటీటీ సంస్థలు  
  • సాయితేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్'
  • డైరెక్ట్ రిలీజ్ కోసం పాతిక కోట్ల ఆఫర్

ఇప్పుడు ఓటీటీ సందడి ఎక్కువైంది. ఇన్నాళ్లూ థియేటర్లో రిలీజైన తర్వాతనే డిజిటల్ వేదికపై ఆయా సినిమాలు విడుదల అయ్యేవి. అయితే, కరోనా దెబ్బతో విధించిన లాక్ డౌన్ కారణంగా థియేటర్లు బంద్ కావడంతో ఇప్పుడు ఓటీటీ ప్లేయర్లు దూకుడు పెంచాయి. కొత్త సినిమాలను సరాసరి రిలీజ్ చేసుకునే విధంగా ఆయా చిత్ర నిర్మాతలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ సంస్థల మధ్య పోటీ పెరగడంతో భారీ స్థాయిలో ఆఫర్లు ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ హీరో సాయితేజ్ నటించిన ఓ చిత్రానికి కూడా భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో సాయితేజ్, నభానటేష్ జంటగా నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం దాదాపు పూర్తయినప్పటికీ, లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని మే ఒకటిన రిలీజ్ చేయాలని మొదట్లో నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. థియేటర్లు మూతబడడం వల్ల విడుదల నిలిచిపోవడంతో, ఇప్పుడీ చిత్ర నిర్మాతలను ఓటీటీ సంస్థలు సంప్రదిస్తున్నాయి. ఈ క్రమంలో ఒక సంస్థ ఏకంగా 25 కోట్లు ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. నిర్మాత మాత్రం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదట!  

Saitej
Nabha natesh
Subbu
OTT
  • Loading...

More Telugu News