West Godavari District: కరోనాతో ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఆర్ఎంవో మృతి

Eluru govt hospital RMO died with corona
  • 15 రోజుల క్రితం కొవిడ్ బారినపడిన ఆర్ఎంవో
  • కోలుకుంటున్న సమయంలో విషమించిన ఆరోగ్యం
  • కాపాడలేకపోయిన చికిత్స
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్‌ఎంవోగా పనిచేస్తున్న ప్రముఖ వైద్యుడు డాక్టర్ యోగేంద్రబాబు (59) నిన్న కరోనాతో మృతి చెందారు. 15 రోజుల క్రితం ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆయనను విజయవాడలోని కొవిడ్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన కోలుకుంటున్నట్టే కనిపించారు. అయితే, బుధవారం రాత్రి ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో నిన్న మృతిచెందినట్టు వైద్యాధికారులు తెలిపారు.
West Godavari District
Eluru
RMO
COVID-19
dead

More Telugu News