Sonia Gandhi: ఆసుపత్రిలో చేరిన సోనియా... హెల్త్ చెకప్ కోసమేనంటున్న డాక్టర్లు

Congress chief Sonia Gandhi joined hospital

  • ఈ సాయంత్రం ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరిక
  • సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందన్న డాక్టర్లు
  • సోనియా ఆరోగ్యంపై బులెటిన్ విడుదల

కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ఈ సాయంత్రం ఆమె ఆసుపత్రిలో చేరడంతో కలకలం రేగింది. గతంలోనూ ఆమె అనారోగ్యం కారణంగా విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అనారోగ్యం పాలయ్యారన్న సందేహాలు బయల్దేరాయి. అయితే సోనియా సాధారణ వైద్యపరీక్షల కోసమే ఆసుపత్రిలో చేరారని డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News