Hardik Pandya: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు పుత్రోదయం

It is a baby boy for Hardik Pandya

  • బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్ ను పెళ్లాడిన హార్దిక్
  • పెళ్లి నాటికే నటాషా గర్భవతి
  • పండంటి శిశువుకు జన్మనిచ్చిన నటాషా

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రయ్యాడు. పాండ్యా అర్ధాంగి నటాషా స్టాంకోవిచ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో వెల్లడించాడు. సెర్బియాకు చెందిన నటాషా స్టాంకోవిచ్ బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది. ఆమధ్య ఉన్నట్టుండి, హార్దిక్ పాండ్యా తాను నటాషాతో డేటింగ్ లో ఉన్నానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతకంటే ఎక్కువగా ఆశ్చర్యానికి గురిచేస్తూ తాము పెళ్లి కూడా చేసుకున్నామని, తన భార్య గర్భవతి అని మరో ప్రకటన చేశాడు. కాగా హార్దిక్ పాండ్యా తండ్రి అయిన నేపథ్యంలో టీమిండియా సహచరుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Hardik Pandya
Baby Boy
Son
Natasha
Cricket
Bollywood
  • Loading...

More Telugu News