హీరో సుశాంత్ ఆత్మహత్య కేసు: రియాపై సుశాంత్ మరో ప్రియురాలు అంకిత సంచలన ఆరోపణలు
- అంకితా లోఖండేని ప్రశ్నించిన పోలీసులు
- గతంలో సుశాంత్ సింగ్ తనకు మెసేజ్ చేశాడన్న అంకిత
- రియా తనని వేధిస్తోందని చెప్పాడని వ్యాఖ్య
- రియాతో తెగదెంపులు చేసుకుంటానని చెప్పాడన్న అంకిత
మణికర్ణిక సినిమా విడుదల సమయంలో సుశాంత్ సింగ్ తనకు మెసేజ్ చేసి అభినందించాడని, రియా తనని వేధిస్తోందని అప్పుడు చెప్పాడని ఆమె పేర్కొంది. రియాతో తాను తెగదెంపులు చేసుకోవాలని భావిస్తున్నానని సుశాంత్ చెప్పాడని అంకిత తెలిపింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న అనంతరం అతడి కుటుంబ సభ్యులను తాను పరామర్శించినట్టు తెలిపింది.