Sushant Singh Rajput: సుశాంత్ ఆత్మహత్య కేసు: నటి రియా చక్రవర్తి ఇంటినుంచి అదృశ్యం

Actress Ria Chakravarthi missing from home

  • సుశాంత్ తండ్రి ఫిర్యాదుతో రియాపై కేసు నమోదు
  • ప్రశ్నించేందుకు ముంబై వచ్చిన బీహార్ పోలీసులు
  • అదృశ్యమైన నటి.. లుక్ అవుట్ నోటీసుల జారీ

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి గాళ్‌ప్రెండ్ రియా చక్రవర్తి అదృశ్యమైంది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు మేరకు ఆమెపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత ఏడాది కాలంలో ఒక అజ్ఞాత వ్యక్తికి  రూ. 15 కోట్లు ట్రాన్స్ ఫర్ అయ్యాయని, ఇందులో రియా  పాత్ర కూడా ఉన్నట్టు అనుమానంగా ఉందని, ఈ విషయంలో దర్యాప్తు చేసి నిగ్గు తేల్చాలని ఆయన కోరారు. దీంతో కేసు నమోదు చేసుకున్న బీహార్ పోలీసులు ఆమెను ప్రశ్నించేందుకు ముంబై వచ్చి ఆమె నివాసానికి వెళ్లారు.

అయితే, ఆమె నివాసానికి చేరుకున్న పోలీసులకు నిరాశే ఎదురైంది. బీహార్ పోలీసులు రావడానికి ముందే ఆమె తన ఇంటి నుంచి అదృశ్యమైంది. దీంతో పోలీసులు ఆమె కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఈ కేసు విచారణను బీహార్ నుంచి ముంబైకి బదిలీ చేయాలంటూ రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు ఆమె తరపు న్యాయవాది సతీవ్ మనీషిండే తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News