france: కరోనాతో అల్లాడుతోన్న భారత్‌కు ఫ్రాన్స్ చేయూత
- వెంటిలేటర్లు, టెస్ట్ కిట్లు, ఇతర వైద్య సామగ్రి అందజేత
- ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి అందజేసిన ఫ్రాన్స్ రాయబారి
- కరోనాను సమర్థంగా కట్టడి చేసిన ఫ్రాన్స్
కరోనా విజృంభణతో అల్లాడిపోతోన్న భారత్‌కు ఫ్రాన్స్ సాయం చేసింది. వెంటిలేటర్లు, టెస్ట్ కిట్లు, ఇతర వైద్య సామగ్రిని భారత్‌కు పంపించింది. భారత్‌లోని ఫ్రాన్స్ రాయబారి ఇమ్యాన్యుయేల్ లెనైన్ వీటిని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి అందజేశారు. ఫ్రాన్స్ నుంచి భారత్‌కు మొత్తం 50 ఒసిరిస్ 3 వెంటిలేటర్లు, 70 యువెల్ 800 వెంటిలేటర్లు, 50 వేల టెస్ట్‌కిట్లు ,50 వేల స్వాబ్స్‌లు అందాయి.
కాగా, కరోనాను ఫ్రాన్స్ సమర్థంగా కట్టడి చేసింది. భారత్‌లో మాత్రం కరోనా విజృంభణ రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రతిరోజు 45 వేలకు పైగా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఫ్రాన్స్‌లో మొత్తం 1,83,804 కేసులు నమోదు కాగా 30,200 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 14,83,157కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 33,425కి పెరిగింది.