Nazib Rajak: మలేషియా మాజీ ప్రధానికి 12 ఏళ్ల కారాగార శిక్ష!

Malaysian ex PM Najib sentenced to 12 years jail
  • అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ నజీబ్ రజాక్
  • 210 మిలియన్ రింగెట్స్ ఫైన్ కూడా
  • తీర్పు వెల్లడించిన హైకోర్టు న్యాయమూర్తి
తాను ప్రధానిగా ఉన్న సమయంలో అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు రుజువు కావడంతో మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ కు 12 సంవత్సరాల కారాగార శిక్షను విధిస్తూ, కోర్టు తీర్పును వెలువరించింది. ఇదే సమయంలో ఆయనపై 210 మిలియన్ రింగెట్స్ (సుమారు 49 మిలియన్ డాలర్లు) జరిమానా కూడా విధిస్తున్నట్టు పేర్కొంది. ఎన్నో బిలియన్ డాలర్ల విలువైన ప్రభుత్వ నిధుల విషయంలో ఆయన అవకతవకలకు పాల్పడ్డారని అభియోగం.

ఆరోపణలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి మహమ్మద్ జన్లాన్ ఘాజైల్, నజీబ్ రజాక్ చట్ట విరుద్ధంగా 10 మిలియన్ డాలర్లను పొందారని తేల్చారు. మలేషియా డెవలప్ మెంట్ కు చెందిన బెర్హార్డ్ యూనిట్ ఎస్ఆర్సీ ఇంటర్నేషనల్ నుంచి ఆయనకు డబ్బు అందిందని, ఆయన దాన్ని అక్రమంగా సొంత ఖాతాలకు తరలించారని తేలిందని తీర్పునిచ్చారు. 
Nazib Rajak
Malaysia
Jail Term

More Telugu News