Governor: జకియా, రవీంద్రబాబులను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన ఏపీ గవర్నర్

Governor nominates two MLCs for legislative council
  • ముగిసిన సత్యనారాయణరాజు, రత్నబాయిల పదవీకాలం
  • వారి స్థానంలో రవీంద్రబాబు, జకియాలకు అవకాశం
  • గవర్నర్ కు సిఫారసు చేసిన ఏపీ ప్రభుత్వం
గవర్నర్ కోటాలో గతంలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన కంతేటి సత్యనారాయణరాజు, టి.రత్నబాయిల పదవీకాలం మార్చిలో ముగిసింది. వారిద్దరి స్థానంలో మరో ఇద్దరిని ఏపీ గవర్నర్ తాజాగా నామినేట్ చేశారు. ఏపీ ప్రభుత్వం సిఫారసు చేసిన మేరకు పి.రవీంద్రబాబు, జకియా ఖానుమ్ లను నూతన ఎమ్మెల్సీలుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శాసనమండలికి నామినేట్ చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వారిద్దరినీ నామినేట్ చేయాలని ఇటీవలే జగన్ సర్కారు గవర్నర్ ను లాంఛనప్రాయంగా కోరింది.  
Governor
Zakia Khanum
Ravindra Babu
MLC
AP Legislative Council
Biswabhusan Harichandan
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News