Koratala Siva: విద్యార్థి రాజకీయాలపై కొరటాల సినిమా!

Koratalas next will be on student politics
  • ప్రతి సినిమాలోనూ సందేశాన్నిచ్చే కొరటాల 
  • 'ఆచార్య' తర్వాత అల్లు అర్జున్ తో ప్రాజక్ట్ 
  • స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్న బన్నీ 
నేటి మన దర్శకులలో కొరటాల శివది ఓ డిఫరెంట్ శైలి. తాను చేసే ప్రతి సినిమాలోనూ వినోదాన్ని మిస్ కాకుండానే.. ఓ సామాజిక అంశాన్ని చర్చిస్తూ.. చక్కని సందేశాన్ని ఇస్తూ.. దానిని జనరంజకంగా రూపొందిస్తుంటాడు. అందుకే, మన స్టార్ హీరోలు అంతా ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అల్లు అర్జున్ కూడా అలాగే కొరటాలతో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అది ఇప్పటికి సెట్ అయింది.

ప్రస్తుతం తాను చిరంజీవితో చేస్తున్న 'ఆచార్య' సినిమా తర్వాత బన్నీతో చిత్రాన్ని చేయడానికి కొరటాల సమాయత్తం అవుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్టు పని కూడా జరుగుతోందని అంటున్నారు. ఇక ఇందులో కాలేజీ.. స్టూడెంట్ రాజకీయాలు.. వంటి అంశాలను ఆయన స్పృశించనున్నట్టు చెబుతున్నారు. ఇందులో బన్నీ స్టూడెంట్ లీడర్ గా సరికొత్త తరహా పాత్రలో కనిపిస్తాడట. ప్రస్తుతం తాను చేస్తున్న 'పుష్ప' తర్వాత బన్నీ చేసే చిత్రం ఇదే అవుతుందని సమాచారం.
Koratala Siva
Allu Arjun
Chiranjeevi
Acharya
Pushpa

More Telugu News