Kanna Lakshminarayana: కన్నా లక్ష్మీనారాయణ గురించి జరుగుతున్న ప్రచారం నిజం కాదు: సోము వీర్రాజు

Somu Veerrajus response on Kanna Lakshminarayana

  • బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం
  • కావాలనే కన్నాను తప్పించారంటూ ప్రచారం
  • బీజేపీలో వ్యక్తి ముఖ్యం కాదన్న వీర్రాజు

ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ప్రమోషన్ లభించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వీర్రాజును అధిష్ఠానం నియమించింది. దీంతో, కన్నా లక్ష్మీనారాయణను కావాలనే అధ్యక్ష పదవి నుంచి తప్పించారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ప్రచారంపై వీర్రాజు స్పందించారు. కన్నాను తప్పించి... ఆయన స్థానంలో తనను నియమించారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చెప్పారు. బీజేపీలో వ్యక్తి ముఖ్యం కాదని అన్నారు.

ఇదే సమయంలో వైసీపీపై వీర్రాజు విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఇంటి స్థలాల కార్యక్రమంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వైసీపీ నేతల అవినీతిని ఎండగడతామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను అమ్మడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు.

Kanna Lakshminarayana
Somu Veerraju
BJP
  • Loading...

More Telugu News