Sonu Sood: పేదలను ఆదుకుంటోన్న రియల్ హీరో సోనూసూద్ ఆస్తులపై ఆసక్తికర చర్చ!

media on sonu sood assests

  • సోను ఆస్తుల గురించి ఓ బాలీవుడ్ మీడియా కథనం
  • సినీ పరిశ్రమలో 20 ఏళ్లుగా ఉన్న సోను
  • సినీ పరిశ్రమలో సంపాదించిన డబ్బుతో హోటల్ బిజినెస్
  • మొత్తం ఆస్తుల విలువ రూ.130 కోట్లు
  • సహాయక చర్యలకే దాదాపు రూ.10 కోట్ల ఖర్చు

పేదలను ఆదుకుంటూ రియల్ హీరో అనిపించుకుంటోన్న సినీనటుడు సోనూసూద్ గురించి దేశం మొత్తం చర్చించుకుంటోంది. ఆయనపై రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసల జల్లుకురిపిస్తోన్న విషయం తెలిసిందే. ఒట్టి మాటలు మాత్రమే చెప్పి సాయం చేయకుండా తప్పించుకునే వారికి భిన్నంగా సోనూసూద్‌ సొంత ఖర్చులతో సాయం చేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు సొంత ఇళ్లకు చేరడానికి సాయం చేసిన సోనూసూద్ అనంతరం కూడా తన సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ ఆస్తుల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఆయన ఆస్తుల గురించి ఓ బాలీవుడ్ మీడియా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆయన సినీ పరిశ్రమలో 20 ఏళ్లుగా ఉన్నాడని, హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లోనూ మంచి నటుడిగా కొనసాగుతున్నాడని పేర్కొంది. సినీ పరిశ్రమలో సంపాదించిన డబ్బుతో ఆయన హోటల్ బిజినెస్ ప్రారంభించాడని తెలిపింది. ఈ హోటళ్ల బ్రాంచులు ముంబైతోపాటు మరికొన్ని నగరాల్లో ఉన్నాయని పేర్కొంది. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.130 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. ఇటీవల ఆయన సహాయక చర్యలకే దాదాపు రూ.10 కోట్లు ఖర్చు పెట్టాడని తెలిపింది.

Sonu Sood
Bollywood
Tollywood
Lockdown
  • Loading...

More Telugu News