sensex: అమ్మకాల ఒత్తిడికి గురైన బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు

Stock markets ends in losses

  • వారాన్ని నష్టాలతో ప్రారంభించిన మార్కెట్లు
  • 194 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 62 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు అమ్మకాల ఒత్తిడికి  గురి కావడంతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 194 పాయింట్లు నష్టపోయి 37,934కి చేరుకుంది. నిఫ్టీ 62 పాయింట్లు కోల్పోయి 11,131కి పడిపోయింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (3.46%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.02%), ఇన్ఫోసిస్ (2.75%), టీసీఎస్ (2.26%), టాటా స్టీల్ (1.97%).
 
టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-6.11%), యాక్సిస్ బ్యాంక్ (-3.12%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.03%), బజాజ్ ఫైనాన్స్ (-2.49%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.48%).

  • Loading...

More Telugu News