Bittiri Satti: సాక్షి టీవీలోకి వచ్చేసిన బిత్తిరి సత్తి... 'గరం గరం వార్తలు'తో సందడి!

Bittiri Satti is Now in Sakshi TV

  • విభిన్నమైన మాటతీరుతో పాప్యులర్ అయిన సత్తి
  • అలరిస్తున్న కొత్త కార్యక్రమం ప్రోమో
  • ఇటీవలి వరకూ టీవీ 9లో పనిచేసిన బిత్తిరి సత్తి

తన విభిన్నమైన మాటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ ఇకపై  తెలుగు వార్తా చానెల్ సాక్షిలో సందడి చేయనున్నారు. ఈ చానెల్ లో ఆయన 'గరం గరం వార్తలు' పేరిట ప్రసారమయ్యే కార్యక్రమంలో యాంకరింగ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదలై, మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ కార్యక్రమం ప్రతి రోజూ రాత్రి 8.30 గంటలకు, తిరిగి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు ప్రసారం అవుతుందని చానెల్ ప్రకటించింది. బిత్తిరి సత్తి ఇటీవలి వరకూ టీవీ9లో యాంకర్ గా, ప్రజంటేటర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. తాజా ప్రోమోను మీరూ చూడవచ్చు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News