Somireddy Chandra Mohan Reddy: ఒక వ్యక్తికి ఇంత పెద్ద హృదయం ఉంటుందని ఊహించలేదు: సోనూసూద్ పై సోమిరెడ్డి ప్రశంసలు

somireddy on sonu sood help

  • సోనూసూద్, నేనైతే ఇక మిమ్మల్ని విలన్ గా చూడలేను
  • సినిమాల్లో మీరు హీరో పాత్ర వేయాల్సిందే
  • వలస కూలీలకు సాయం చేశారు
  • ఇప్పుడు మదనపల్లి రైతుకు ట్రాక్టర్ ఇచ్చారు

చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం మహల్రాజపల్లిలో కుమార్తెలు తండ్రికి పొలం పనుల్లో సాయపడటం చూసి సినీనటుడు సోనూసూద్ ఆ కుటుంబానికి ట్రాక్టర్ కొనిచ్చిన విషయం తెలిసిందే. సోనూసూద్ చేసిన ఈ సాయం పట్ల సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయనను టీడీపీ నేతలు కూడా ప్రశంసిస్తున్నారు.

అవసరం ఉన్న వారికి సోనూసూద్‌ సాయం చేస్తోన్న తీరుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి స్పందిస్తూ.. 'సోనూసూద్, నేనైతే ఇక మిమ్మల్ని విలన్ గా చూడలేను. సినిమాల్లో మీరు హీరో పాత్ర వేయాల్సిందే. టాటా, మహీంద్ర, ఇన్ఫోసిస్ వంటి సంస్థల దాతృత్వాలు చూశాం. ఒక వ్యక్తికి ఇంత పెద్ద హృదయం ఉంటుందని ఊహించలేదు. వలస కూలీలకు సాయం, రైతుకు ట్రాక్టర్, విద్యార్థులు స్వదేశం రావడంలో మీ చొరవ అభినందనీయం' అని సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.

కాగా, కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఎన్నో ఇబ్బందులు పడిన వలస కూలీలకు సోనూసూద్ సాయం చేసిన విషయం తెలిసిందే. దీంతో రియల్ హీరో అంటూ ఆయన పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ తర్వాత కూడా పలువురికి సాయపడి ఆయన అందరితోనూ శభాష్ అనిపించుకున్నారు.

Somireddy Chandra Mohan Reddy
Telugudesam
Sonu Sood
  • Loading...

More Telugu News