Doctor Kalam: అబ్దుల్ కలామ్ బయోపిక్ లో హీరో చాన్స్ కొట్టేసిన అలీ!

Ali is the Hero in Kalam Biopic

  • జగదీశ్ తానేటి దర్శకత్వంలో బయోపిక్
  • అలీ 1111వ సినిమాగా 'డాక్టర్ కలామ్'
  • వర్చ్యువల్ ఈవెంట్ గా సాగిన ప్రారంభోత్సవం

అంతరిక్ష శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు సాధించి, ఆపై రాష్ట్రపతిగానూ సేవలందించి, కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచిన భారతరత్న అబ్దుల్ కలామ్ బయోపిక్ లో హీరోగా నటించే అవకాశం రావడం, అంతటి మహానుభావుడి పాత్రను తాను పోషించడం తనకు దక్కిన మహద్బాగ్యమని నటుడు అలీ వ్యాఖ్యానించారు. ఈ అవకాశం తనకు లభించినందుకు వెంకటేశ్వరునికి, జీసస్ కు, అల్లాకు నిత్యమూ మొక్కుతానని అన్నారు.

ఆన్ లైన్ మాధ్యమంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. జగదీశ్ దానేటి దర్శకత్వంలో పింక్ జాగ్వార్ ఎంటర్ టెయిన్ మెంట్,హాలీవుడ్ మీడియా అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్ 'డాక్టర్ కలామ్' పేరిట ఈ చిత్రాన్ని సంయుక్తంగా ప్రారంభించాయి. ఈ సందర్భంగా మిషన్ కలామ్ పేరిట వర్చ్యువల్ ఈవెంట్ జరిగింది. దర్శకుడు జగదీశ్ మాట్లాడుతూ, ఇండియాకు 11వ రాష్ట్రపతిగా పనిచేసిన కలాం బయోపిక్ నటుడు అలీకి 1111వ చిత్రం కావడం కాకతాళీయమని అన్నారు.

Doctor Kalam
Ali
Hero
Biopic
  • Loading...

More Telugu News