Hardhik Pandya: నెలలు నిండిన నటాషా... తన పిక్ తో మనసులు దోచుకున్న పాండ్యా!

Hardhik Pandya Pic Goes Viral

  • గత సంవత్సరం చివర్లో నిశ్చితార్థం
  • ఆ తరువాత రహస్యంగా వివాహం
  • తండ్రి కాబోతున్న పాండ్యాకు శుభాకాంక్షలు

తన భార్య నటాషా స్టాంకోవిచ్ కి నెలలు నిండాయని, తన కుటుంబంలోకి, ఈ ప్రపంచంలోకి ఓ చిన్నారికి స్వాగతం పలికేందుకు ఆత్రంగా ఎదురుచూస్తున్నానని చెబుతూ, క్రికెటర్ హార్దిక్ పాండ్యా పెట్టిన ఓ చిత్రం ఇప్పుడు అభిమానుల హృదయాలను దోచుకుంది. గత సంవత్సరం డిసెంబర్ 31న దుబాయ్ సముద్ర జలాల మధ్య నటాషాకు ఉంగరం తొడిగి ఎంగేజ్ మెంట్ చేసుకున్న పాండ్యా, ఆపై రహస్యంగా ఆమెను వివాహమాడాడు.

పాండ్యా, నటాషాల వివాహం గురించిన విషయం బయటకు రాకున్నా, ఆమె గర్భవతని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా, తనకు పెళ్లయిందన్న విషయాన్ని అతను బహిర్గతం చేశాడు. ఇక పాండ్యా తాజా చిత్రం పోస్ట్ చేసిన నిమిషాల్లోనే వైరల్ అయింది. పలువురు క్రికెటర్లు, మాజీలు, ఇతర క్రీడాకారులు, బాలీవుడ్ సెలబ్రిటీలు పాండ్యా దంపతులకు ముందుగానే శుభాభినందనలు తెలుపుతున్నారు.

కాగా, వెన్నెముకకు గాయమైన తరువాత, ఆపరేషన్ చేయించుకున్న హార్దిక్ పాండ్యా, దాదాపు 12 నెలలుగా క్రికెట్ కు దూరంగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే. రానున్న ఐపీఎల్ 2020 సీజన్ కోసం పాండ్యా సిద్ధమవుతున్నాడు. 

Hardhik Pandya
Natasha
Pregnent
Viral Pics
  • Loading...

More Telugu News