Nagababu: ఎవరినీ నిందించని మతం హిందూమతం: నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Nagababu comments on Hindu religion

  • తాను నాస్తికుడ్నని వెల్లడించిన నాగబాబు
  • అయితే హిందూ మతాన్ని గౌరవిస్తానని వెల్లడి
  • హిందూమతం మనిషిని మనిషిగా బతకమని చెబుతుందని వివరణ

టాలీవుడ్ సీనియర్ నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు హిందూమతంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానొక నాస్తికుడ్ని అయినా కొన్ని మతాలపై తన అభిప్రాయాలు చెప్పదలచుకున్నానని వెల్లడించారు. తాను హిందూమతాన్ని గౌరవిస్తానని తెలిపారు. అందుకు గల కారణాలను కూడా నాగబాబు ట్విట్టర్ లో వివరించారు.

"ఈశ్వరుడు ఒక్కడే అని నమ్మినా, అనేక దేవతలు ఉన్నారని నమ్మినా, విగ్రహారాధనను నమ్మినా, ఇతర మతాలను నమ్మినా, అసలు దేవుడే లేడని చెప్పే నాస్తికులను సైతం ఎవరినీ నిందించని మతం హిందూమతం. హిందూమతం మనిషిని మనిషిగా బతకమని చెబుతుంది. ఇతర మతాలతో సఖ్యంగా ఉండమని చెబుతుంది. అంతేతప్ప...నీ మతం కానివాడిని చంపెయ్యి, విగ్రహారాధన చేసేవాళ్లు నరకానికి పోతారు, మా దేవుడే నిజమైన దేవుడు మీ దేవుడు చెడ్డవాడు అంటూ పిచ్చిమాటలు చెప్పదు... అందుకే హిందూయిజం అంటే నాకు గౌరవం... కానీ నేను నాస్తికుడ్ని" అంటూ వివరించారు.

Nagababu
Hindu
Religion
Ethiest
Janasena
  • Loading...

More Telugu News